మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి రవితేజ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
ఇలా మొదటి వారం రోజుల రన్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నైజాం మార్కెట్ లో అదరగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం ఏడవ రోజు నైజాంలో 2.2 కోట్ల మేర షేర్ ని రాబట్టినట్టు తెలుస్తుంది.
దీనితో ‘ఇరుముడి’ మొత్తం ఈ 7 రోజుల్లో 26 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. సో నైజాం మార్కెట్ లో ఇరుముడి సెన్సేషనల్ సక్సెస్ ని సాధించి ఇంకా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


