గ్లింప్స్ టాక్: ఈ రవితేజ కదా కావాల్సింది.. ‘ఇరుముడి’తో కంబ్యాక్ ప్రామిస్!

గ్లింప్స్ టాక్: ఈ రవితేజ కదా కావాల్సింది.. ‘ఇరుముడి’తో కంబ్యాక్ ప్రామిస్!

Published on Jun 3, 2026 12:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఇరుముడి”. మొదటి నుంచీ మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ ని ఇప్పుడు వదిలారు. అయితే ఈ గ్లింప్స్ చూసిన తర్వాత మాత్రం ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి అసలు గత కొన్నాళ్ల నుంచి మిస్సవుతున్న అప్పటి రవితేజ ఇతను కదా అనే రీతిలో ఇందులో దర్శకుడు శివ నిర్వాణ ప్రెజెంట్ చేయడం బాగుంది.

తన కూతురుతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ గ్రామీణ నేపథ్యంలో చూపించిన సన్నివేశాలు చాలా సహజంగా ఒకప్పుడు రవితేజ సినిమాల్లో కనిపించే సహజత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చాయని చెప్పవచ్చు.

వారి కెమిస్ట్రీ మధ్యలో రవితేజపై మరో స్ట్రాంగ్ ఎమోషన్ చివరిలో అయ్యప్ప స్వామి మాల అంశాలతో ముగించిన గ్లింప్స్ రవితేజకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇక ఇందులో జీవి ప్రకాష్ కుమార్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉందని చెప్పాలి. సో ఓవరాల్ గా రవితేజ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ నుంచి ఈ ఆగష్టులో సాలిడ్ హిట్ ప్రామిస్ ని అయితే చేసేశారని అనుకోవచ్చు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు