రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఇరుముడి’ అనే చెప్పవచ్చు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత అభిమానులతో పాటుగా జెనరల్ ఆడియెన్స్ లో కూడా రవితేజ సినిమా పట్ల అత్యంత ఆసక్తి నెలకొంది.

ఇలా ఎట్టకేలకి రవితేజ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి మారిన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని డీసెంట్ రన్ టైం తో లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇతర సినిమాల్లా భారీ నిడివితో కాకుండా 2 గంటల 25 నిమిషాల నిడివితో మాత్రమే వస్తుందట. ఇదో మంచి మూవ్ అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. సో కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో వీక్షించవచ్చు.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక ఇతర పాత్రలు పోషించారు. ఏజెన్సీ ప్రాంతాల సహజ లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ 21న తెలుగు, తమిళంలో సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version