రవితేజ ‘రణరంగం’ వదిలేశాడా ?

Published on Aug 13, 2019 7:02 pm IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌ లో హల్ చల్ చేస్తోంది. రణరంగం కథను డైరెక్టర్ సుదీర్ వర్మ ముందుగా రవితేజకు చెప్పారట. రవితేజకి కూడా రణరంగం కథ బాగా నచ్చిందట. కానీ ఆ తరువాత కొన్ని కారణాల వల్ల, రణరంగం కథ పై శర్వానంద్‌ బాగా ఇంట్రస్ట్ చూపించడంతో ‘రణరంగం’ సినిమాను శర్వాతో చేశారు.

ఇక ‘గ్యాంగ్‌స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర శర్వా గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుందట. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ.

సంబంధిత సమాచారం :