ఆ సినిమా పట్టాలెక్కితే రవితేజ డ్యూయల్ రోల్.?

Published on May 30, 2020 3:00 am IST

మాస్ మహారాజ రవితేజ కు ఒక అదిరిపోయే హిట్ రావాలని తన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబడిన “డిస్కో రాజా” ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయే సరికి ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న “క్రాక్” పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు.

అయితే దీని అనంతరం దర్శకుడు రమేష్ వర్మతో రవితేజ ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో సరైన క్లారిటీ లేదు కానీ కొన్ని ఆసక్తికర విషయాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రం కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More