రవితేజ ఈ నెల మూడో వారం నుండి…?

Published on Apr 7, 2019 9:20 pm IST

‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ నెల మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఆ మేరకు చిత్రబృందం సన్నద్ధం అవుతుందట. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్. తేరి స్క్రిప్ట్ లో సంతోష్ శ్రీనివాస్ తెలుగుకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి మరియు మాడ్యులేషన్ కు తగ్గట్లు హీరో క్యారెక్టరైజేషన్ మార్చాడట శ్రీనివాస్. మరి ఆ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి

సంబంధిత సమాచారం :