క్రాకింగ్ టీఆర్పీ రాబట్టిన మాస్ మహారాజ్ “క్రాక్”.!

Published on Mar 25, 2021 2:00 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లేటెస్ట్ చిత్రం “క్రాక్”. ఈ ఏడాది తెలుగులో కొన్ని ఇబ్బందుల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది. కేవలం 50 శాతం సీటింగ్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచడమే కాకుండా రవితేజ కు కూడా ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ చిత్రంగా నిలిచింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఇటీవలే స్మాల్ స్క్రీన్ పై కూడా టెలికాస్ట్ చెయ్యగా క్రాకింగ్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. గత వారంకు ముందు స్టార్ మా లో ప్రసారం కాబడిన ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామా ఆరోజు మంచి మ్యాచ్ అలాగే పోటీ ఉండి కూడా 11.7 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను సాధించి సత్తా చాటింది.

మొత్తానికి మాత్రం ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా మంచి ఆదరణను అందుకుందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ ఎలెక్ట్రిఫయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ల రోల్స్ మరో బిగ్ ఎస్సెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :