నైజాం లో సూపర్ స్ట్రాంగ్ గా మాస్ మహారాజ్ “క్రాక్”వసూళ్లు.!

Published on Jan 14, 2021 5:33 pm IST

మన టాలీవుడ్ లో అందరి ఫేవరెట్ హీరో మాస్ మహారాజ రవితేజ అందుకున్న లేటెస్ట్ సాలిడ్ కం బ్యాక్ చిత్రం “క్రాక్”. తన ఆల్ టైం హిట్ కాంబో గోపీచంద్ మలినేని, శృతి హాసన్ అలాగే థమన్ లతో వచ్చిన ఈ చిత్రం మళ్ళీ స్యూర్ షాట్ హిట్టయ్యి మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

మరి ఇదిలా ఉండగా కొన్ని చిక్కులతోనే విడుదల అయినా అలాగే గట్టి పోటీ ఉన్నా సరే క్రాక్ తో మాస్ మహారాజ్ సూపర్ స్ట్రాంగ్ గానే నిలిచాడు. మరి అయితే ఈ చిత్రం తాలూకా నైజాం 4వ రోజు వసూళ్లు 51 లక్షలు షేర్ వసూలు చేసిందట. అంతే కాకుండా ఈ నాలుగు రోజులకు కలిపి నైజాం లో క్రాక్ 4 కోట్ల 62 లక్షలు ఇప్పటి వరకు రాబట్టింది.

ఇక అలాగే టోటల్ బ్రేకీవెన్ కు కూడా అన్ని చోట్లా దగ్గరగా ఉన్న ఈ చిత్రం ఈ రెండు మూడు రోజుల్లో అది కూడా కొట్టేయనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం అనంతరం రవితేజ నటిస్తున్న “ఖిలాడి” కూడా అతి త్వరలోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More