రవితేజ కెరీర్ బెస్ట్ గా క్రాక్… ఫస్ట్ టైం ఆ ఫీట్ అందుకున్నాడు!

Published on Jan 25, 2021 12:02 am IST

విజయాలు లేక డీలా పడ్డ రవితేజకు క్రాక్ ఊపిరి పోసింది. బ్లాక్ బస్టర్ హిట్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. రవితేజ క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోగా క్రాక్ తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్, వసూళ్ళలో జోరు చూపిస్తుంది. ఇక క్రాక్ రవితేజ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి క్రాక్ రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం అందుతుంది. మొదటిసారి రవితేజ రూ. 50కోట్ల వసూళ్ల మార్కును దాటారు.

కోవిడ్ నిబంధనల కారణంగా థియేటర్స్ యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న తరుణంలో ఈస్థాయి వసూళ్లు, రికార్డు అని చెప్పాలి. దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ ఎంటర్టైనర్ గా క్రాక్ తెరకెక్కించారు. రవితేజ పోలీస్ అధికారిగా కనిపించగా సముద్ర ఖని, వరలక్ష్మీ కీలక రోల్స్ చేశారు. ఇక క్రాక్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. థమన్ సంగీతం క్రాక్ విజయంలో భాగమైంది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న క్రాక్, మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More