రవితేజ మళ్లీ ఆమెనే రిపీట్ చేస్తాడట

Published on Mar 11, 2020 5:21 pm IST

వరుస పరాజయాలు పలకరిస్తున్నా మాస్ మహారాజ రవితేజ స్పీడ్ మాత్రం తగ్గట్లేదు. వరుసగా సినిమాలకు సైన్ చేసుకుంటూ వెళుతున్నారాయన. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్న ఆయన త్వరలో రమేష్ వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రం స్టార్ట్ చేయనున్నారు. ఇది కాకుండా త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది 1980ల నేపథ్యంలో జరిగే కథగా ఉండనుంది.

ఇందులో కథానాయకిగా శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయి. గతంలో ‘బలుపు’ చిత్రంలో కలిసి నటించిన ఈ ఇద్దరూ ప్రజెంట్ ‘క్రాక్’ చిత్రంలో కూడా జోడీగా చేస్తున్నారు. అన్నీ కుదిరితే త్రినాథరావ్ నక్కిన చిత్రంలో కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించవచ్చట. త్రినాథరావ్ ఇప్పటికే శృతితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ ఇదే జరిగితే ఇద్దరికీ ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది.

సంబంధిత సమాచారం :

More