మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా నిలిచిన ‘కృష్ణ’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకుంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటించింది. 2008లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
ఈ చిత్రాన్ని మే 8వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ మార్క్ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ మరియు చక్రి అందించిన సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాను ఒక కంప్లీట్ ఎంటర్టైనర్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా రవితేజ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాయి.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు 4K క్వాలిటీతో సరికొత్తగా తీసుకువస్తున్నారు. థియేటర్లలో మరోసారి ఈ మాస్ వినోదాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.


