నేను కూడ రెడీ అంటున్న రవితేజ

Published on Jun 4, 2021 8:03 pm IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. వాటిలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ కూడ ఉంది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెకండ్ వేవ్ మొదలైన కొన్నిరోజులకే రమేష్ వర్మ కరోనాకు గురికావడంతో షూటింగ్ నిలిపివేశారు టీమ్. అప్పటివరకు చిత్రం 60 శాతం మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకో 40 శాతం మిగిలే ఉంది. ఈ ఆలస్యంతోనే సినిమా రిలీజ్ డేట్ స్కిప్ అయిపోయింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా మిగతా చిత్రీకరణను పూర్తిచేయాలని రవితేజ అండ్ టీమ్ భావిస్తున్నారు.

అందుకే జూలై మొదటి వారంలో సినిమాను తిరిగి సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. షూటింగ్ మొదలైన నెల రెండు నెలల్లో పూర్తిచేసి వీలైనంత త్వరగా కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకోవాలనేది ‘ఖిలాడి’ టీమ్ ప్లాన్. ఇకపోతే మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఉన్ని ముకుందన్‌, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగులో విడుదలయ్యాక హిందీలో కూడ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ‘క్రాక్’ హిట్ కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :