బోయపాటి తరువాత హీరో అతనే ?

బోయపాటి తరువాత హీరో అతనే ?

Published on May 23, 2021 3:00 AM IST

బాలయ్య బాబు ‘అఖండ’ సినిమా టీజర్ ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకుని రికార్డ్స్ ను క్రియేట్ చేసే సరికి, ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను తరువాత సినిమా పై అప్పుడే పుకార్లు మొదలైపోయాయి. కాగా తాజాగా తన తరువాత సినిమాని బోయపాటి రవితేజతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఇప్పటికే బోయపాటి రవితేజ కోసం ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పక్కా కామెడీతో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా రవితేజకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ భద్ర అనే సూపర్ హిట్ సినిమా వీరి ఖాతాలో ఉంది కాబట్టి .. వీరిద్దరి కాంబినేషన్ పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు. ఎలాగూ మరో మూడు నెలల్లో అఖండ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు