ఓన్లీ ఫ్యామిలీ అంటున్న రవితేజ !
Published on Feb 20, 2018 11:20 am IST

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ గత సినిమాలు ‘సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం’ తరహాలోనే ఈ చిత్రం కూడా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఈ మధ్యే హైదరాబాద్లో షూట్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఆ తరవాత వైజాగ్లో వారంపాటు ఒక షెడ్యూల్ జరుపుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక స్టూడియోలో మూడవ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పూర్తిగా ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందు కోసం ప్రతి రోజు 50 మందికి వరకు ఆర్టిస్టులు షూటింగ్లో పాల్గొంటున్నారట. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు కొద్దిరోజుల క్రితమే రూ.25 కోట్లకి అమ్ముడైన హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రియదర్శి, ప్రవీణ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook