రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రవితేజ “రామారావు”

Published on Dec 6, 2021 12:30 pm IST

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. రవితేజ నటిస్తున్న సరికొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న రవితేజ ఈ చిత్రం తో కూడా ప్రేక్షకులను అభిమానులను అలరించడానికి సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యన్షా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సామ్ సీ ఎస్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :