ఫస్ట్ లుక్ తో రానున్న ‘టైగర్ నాగేశ్వర్రావు’ !

Published on Feb 7, 2023 5:00 pm IST

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతుంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం భారీ స్థాయిలో జరగుతుంది. కాగా త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాలా బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా రవితేజ కామెడీ బాగా చేస్తాడని తెలుస్తోంది.

ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగ గా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ చాలా కాలం తర్వాత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్‌ నటిస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త’ ఫేం వంశీకృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :