విఐ. ఆనంద్ తో రవితేజ సినిమా !

15th, March 2018 - 02:06:51 PM

నిర్మాత రామ్ తాళ్లూరి తో ఎస్.ఆర్.టి బ్యానర్ లో రవితేజ ప్రస్తుతం ‘నేలటికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ మరోసారి ఈ నిర్మాతతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. వి.ఐ.ఆనంద్ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోంది.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. ‘ఒక్క క్షణం’ సినిమా తరువాత వి.ఐ.ఆనంద్ రవితేజను దర్శకత్వం వహించబోతుండడం విశేషం. రవితేజ ఏప్రిల్ నుండి శ్రీను వైట్ల సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత వి.ఐ.ఆనంద్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు మాస్ రాజ.