‘ఆర్సి12’ కొత్త షెడ్యూల్ వివరాలు !

Published on Sep 4, 2018 9:51 am IST


‘రంగస్థలం’ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన12వ చిత్రంలో నటిస్తున్నాడు. మొన్నటిదాకా హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు యూరప్ కు షిఫ్ట్ అయ్యింది. యూరోప్ లోని అజర్ బైజాన్ అనే ప్రాంతంలో ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. 25రోజులపాటు జరుగునున్న ఈ లాంగ్ షెడ్యూల్లో చరణ్, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ మరియు ఇతర నటీనటులపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ ను కొత్తగా చూపించనున్నారు బోయపాటి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డి వి వి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :