సంక్రాంతి బరిలో రామ్ చరణ్ !
Published on Jun 16, 2018 1:40 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘రంగస్థలం’ సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టారు .ప్రస్తుతం అయన తన 12 వ చిత్రాన్ని బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారు . ఈ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానుందని కొద్దిసేపటి క్రితం చిత్ర నిర్మాత దానయ్య డి వి వి అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను తన దైన స్టయిల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం . కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి నటులు స్నేహ , ప్రశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . మరి సంక్రాంతి బరిలో నిలుచే ఇతర సినిమాలకు రామ్ చరణ్ సినిమా గట్టి పోటీనివ్వడం ఖాయం.

  • 10
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook