మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రాజవంశస్థుడు, రాజమార్తాండ’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదని, సినిమాకు ఇంకా టైటిల్ పెట్టనేలేదని చిత్ర సన్నిహిత వర్గాలు ద్వారా తెలుస్తోంది. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయికగా, వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ ఇటీవల చిత్రం ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


