‘ఆర్ ఎక్స్ 100’ ట్రైలర్ తో వచ్చిన గ్లామర్ బ్యూటీ !

Published on Sep 10, 2019 3:17 pm IST

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ తాజాగా నటిస్తోన్న సినిమా ‘ఆర్ డి ఎక్స్ లవ్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో కథను హైలెట్ అయ్యేలా ట్రైలర్ ను కట్ చేశారు చిత్రబృందం. ముఖ్యంగా పాయల్ రాజ్ ఫుత్ పలికిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో సీరియస్ కంటెంట్ ఉందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఆ చిత్ర టీజర్ లో పాయల్ ఆర్ ఎక్స్ 100 కు మించి, అందాలు ఆరబోసింది. దాంతో ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో నాలుగు మిలియన్స్ వ్యూస్ దాకా సాధించి సంచలంగా మారింది. మరి ట్రైలర్ ను ఏ రేంజ్ వ్యూస్ ను సాధిస్తోందో చూడాలి.

కాగా ఆర్ ఎక్స్ 100 చిత్రం సంచలన విజయం సాధించినా, ఆ స్థాయిలో అవకాశాలైతే ఈ భామకు దక్కలేదు. మరి ఈ చిత్రంతోనైనా పాయల్ రాజ్ ఫుత్ కి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి. ఇక ఈ సినిమాలో పాయల్ సరసన తేజు కంచర్ల నటిస్తుండగా, సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. ఇక ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More