రజినీ ట్రెండ్ సెట్టింగ్ హిట్ ‘బాషా’ తెలుగు రీరిలీజ్ డేట్!

రజినీ ట్రెండ్ సెట్టింగ్ హిట్ ‘బాషా’ తెలుగు రీరిలీజ్ డేట్!

Published on Apr 19, 2025 8:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో వచ్చిన ఎన్నో భారీ హిట్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ హిట్ చిత్రం “బాషా” కోసం తెలియని వారు ఎవరూ ఉండరు. అసలు ఒక హీరో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ అలాగే హీరోకి క్రేజీ ఫ్లాష్ బ్యాక్ అనే టెంప్లెట్ లాంటివి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి సెన్సేషనల్ హిట్ అయ్యిన ఈ ఫార్ములా లోనే చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చింది.

ఇక ఈ చిత్రం తెలుగులో ఇప్పుడు రీరిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగు ఆడియెన్స్ ఇప్పటికీ రిపీట్స్ లో చూస్తారు మరి మళ్ళీ థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తారో అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా దేవా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు