“రాధే శ్యామ్” హిందీ ఓటిటి రిలీజ్ డేట్ పై సరైన క్లారిటీ.!

Published on Apr 27, 2022 2:45 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అయ్యాక ఓటిటి రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూడగా ఈ సినిమాని త్వరగానే దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేసారు.

ఇక హిందీ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా చూస్తుండగా పలు డేట్స్ అయితే వైరల్ గా వినిపిస్తున్నాయి. ఎక్కువగా అయితే ఈ మే 3 మరియు 4 తేదీలు వినిపిస్తుండగా వాటిలో అయితే నెట్ ఫ్లిక్స్ వారు 4వ తేదీని అధికారికంగా పొందుపరిచారు. అలాగే అదనపు రన్ టైం తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మొత్తం నలుగురు సంగీత దర్శకులు పని చేయగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :