మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ గురువారం సాయంత్రం హోటల్ తాజ్ డెక్కన్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రియల్ హీరోలను ఆహ్వానిస్తున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ రియల్ హీరోలు లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్ లను అభినందించారు.
ఇటివల ఎస్.అర్.నగర్ లో ఎటియం నుండి డబ్బులు డ్రా చేయడానికి లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్ లు వెళ్ళారు. ఎటియం క్యాష్ డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకోవడంతో 200 రూపాయలకు బదులు 24 లక్షలు వచ్చాయి. నిరుద్యోగులైన వీరు నిజాయితిగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిని పలువురు ప్రశంసించారు. తాజాగా ‘పవర్’ దర్శకనిర్మాతలు, హీరో మరియు యూనిట్ సభ్యులు సత్కరించనున్నారు.
రవితేజ సరసన హన్సిక, రెజినా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడిగా పరిచయం అయ్యారు. తమన్ సంగీతం అందించారు.


