పవన్ ఆ సినిమా చేయడానికి ఆయన తండ్రే కారణమా ?

Published on Jun 23, 2021 4:08 am IST

పవన్ కళ్యాణ్ చాలా త్వరగా సైన్ చేసిన సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రం. త్రివిక్రమ్ ఈ చిత్రాన్నిసజెస్ట్ చేసిన వేంటనే పవన్ ఒప్పుకోవడం, చిత్రం సెట్స్ మీదకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ డేట్స్ పూర్తిగా ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్నికే కేటాయించడం జరిగింది. కానీ రీమేక్ కోసం అడ్జెస్ట్ చేసి కొన్ని డేట్స్ సాగర్ కె చంద్రకు ఇవ్వడం జరిగింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇవన్నీ జరిగాయి.

పవన్ అంత త్వరగా ఆ సినిమా సైన్ చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. అది కూడ ఆయాబ్ వ్యక్తిగత జీవితంలోనివే కావడం విశేషం. ఒరిజినల్ కథలో కథానాయకుడు ఎక్సయిజ్ విభాగంలో పనిచేసే ఎస్ఐ. ఇదే పవన్ జీవితానికి రిలేట్ అయింది. పవన్ కళ్యాణ్ తండ్రి కూడ ఆబ్కారీ శాఖలో పనిచేసిన పోలీస్ అధికారి. ఇదే ఆ పాత్ర చేయడానికి పవన్ కు మోటివేషన్ అయ్యుండొచ్చు. పవన్ గతంలో పోలీస్ పాత్రలు చేసినా ఆబ్కారీ శాఖలో పనిచేసే పోలీస్ పాత్రను చేయలేదు. ఇక ఈ కథలో సామాన్యులకు, డబ్బున్న వ్యక్తులకు సొసైటీలో ఎలాంటి తేడా ఉంటుంది అనే అంశం కూడ నిగూఢంగా చర్చకు వస్తుంది. ఇది కూడ పవన్ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాల్లో ఒకటి కావొచ్చు. గత రెండు రోజులుగా పవన్ ఫ్యాన్స్ ఈ అంశాలనే సోషల్ మీడియాలో వీడియో రూపంలో ప్రజెంట్ చేసి వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :