నాని సరసన హీరోయిన్ కజిన్ !

నాని సరసన హీరోయిన్ కజిన్ !

Published on Aug 16, 2018 11:29 AM IST

‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ కజిన్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే గతంలో నాని సరసన ‘మజ్ను’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్‌ ఇప్పుడు నాని సరసన నటించబోతుంది. ఆమె గతంలో మూడు నాలుగు తమిళం మలయాళం చిత్రాల్లో నటించింది. ఐతే మోనికా జాన్‌ కు తెలుగులో ఇదే మొదటి సినిమా.

కాగా కథ రీత్యా నాని ఈ చిత్రంలో భిన్న వయసు గల పాత్రల్లో నటించనున్నాడు. అందుకోసం నాని పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు సమాచారాం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఈ జెర్సీ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు