ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”

Published on Mar 27, 2024 10:02 AM IST

ఈ ఏడాదిలో మన టాలీవుడ్ సహా సౌత్ నుంచి ప్రతి ఇండస్ట్రీలో కూడా చిన్న సినిమాలు మ్యాజిక్ చేసాయి. థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన పలు చిత్రాలు మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలవగా ఆ చిత్రాల్లో కోలీవుడ్ నుంచి వచ్చిన ప్రేమ కథా చిత్రం “లవర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో “ట్రూ లవర్” పేరిట ఎస్ కే ఎన్, మారుతీలు రిలీజ్ చేశారు.

తమిళ టాలెంటెడ్ నటుడు మణికందన్ అలాగే “మ్యాడ్” సినిమా ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం మంచి టాక్ ని తెచ్చుకుని అదరగొట్టింది. అయితే తెలుగులో కూడా చాలా మంది మాట్లాడుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు మరియు హిందీ భాషల్లో అయితే ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడాలి అనుకునేవారు హాట్ స్టార్ నుంచి ట్రై చేయవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు