‘కబాలి’ ప్రీమియర్ షో ల ప్రభంజనం

kabali
ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం కబాలి మేనియాలో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇండియాలో జూలై 22న ఈ చిత్రం విడుదలకానుండగా అంతకంటే 20 గంటల ముందే యూఎస్ లో తమిళ, తెలుగు భాషల్లో కబాలి ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడనున్నాయి.

దాదాపు 227 థియేటర్లలో 450 స్క్రీన్లలో జూలై 21న ఇండియా టైమింగ్ ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రీమియర్ షోలు ఆరంభమవుతాయి. ఇప్పటి వరకూ ఏ సౌత్ ఇండియన్ సినిమా కూడా ఇంత భారీ ఎత్తున ప్రీమియర్ షో ల రూపంలో ప్రదర్శింపబడలేదు. ఈ దెబ్బతో రజనీ ‘బాహుబలి’ రికార్డులని సైతం బద్దలుకొట్టారు. కలైపులి ఎస్. థాను నిర్మాణంలో పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.