“కేజీయఫ్ 2” రైట్స్ కు భారీ డిమాండ్.?

“కేజీయఫ్ 2” రైట్స్ కు భారీ డిమాండ్.?

Published on May 20, 2020 8:12 PM IST


ప్రస్తుతం మన ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ అంచనాలను నెలకొల్పుకున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ ట్రీట్ మొత్తం భారతదేశపు సినిమా ప్రేమికులకు ఒక ఊపు ఊపింది. చాప్టర్ 1 మాస్ ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వడంతో ఇప్పుడు రాబోతున్న చాప్టర్ 2 కోసం భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు.

ఇంతటి క్రేజ్ ను సంతరించుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ కన్నా ముందుగా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు సంబంధించి సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రం తాలూకా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మొత్తం 175 కోట్లు పలికినట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అప్పుడే ఈ స్థాయి బిజినెస్ జరుపుకుంటుండడం ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ కు నిదర్శనం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు