అక్కడ “వకీల్ సాబ్”కు రికార్డు స్థాయి రిలీజ్.!

Published on Apr 2, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “వకీల్ సాబ్” పై అంతకంతకూ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు చేయిస్తున్న ప్రమోషన్స్ లో ఈ సినిమా అసలు రీమేక్ సినిమాలా కాకుండా పవన్ స్ట్రైట్ సినిమాలనే అంచనాలు అంతకు మించిన స్థాయిలోనే ఏర్పర్చుకుంది. మరి పవన్ నటించిన లాస్ట్ చిత్రం “అజ్ఞ్యాతవాసి” ఏ లెవెల్లో హైప్ ను మన తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో సెట్ చేసుకుందో తెలిసిందే.

ఇప్పుడు మన దగ్గర ఏమో కానీ యూఎస్ లో మాత్రం అజ్ఞ్యాతవాసి రికార్డులను వకీల్ సాబ్ బ్రేక్ చేసేసి భారీ ఎత్తున విడుదలకు రెడీగా ఉందని ఈ సినిమా సమర్పకులు బోనీ కపూర్ తెలియజేసారు. మొత్తం 700 స్క్రీన్స్ లో వకీల్ సాబ్ భారీ ఎత్తున విడుదల అవుతుందని తెలిపారు. అయితే పవన్ నటించిన గత చిత్రం అజ్ఞ్యాతవాసి 500కు పైగా లొకేషన్స్ లో విడుదల కాగా ఇప్పుడు వకీల్ సాబ్ అంతకు మించి అందులోనూ లాక్ డౌన్ తర్వాత ఇదే రికార్డు స్థాయి రిలీజ్ అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పవన్ కం బ్యాక్ సాలిడ్ గానే ఉండనుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :