రామ్ డబల్ యాక్షన్ తో ఆకట్టుకున్న ‘రెడ్’ టీజర్ !

Published on Feb 28, 2020 5:15 pm IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. కాగా ఈ సినిమా టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ లో మెయిన్ మూవీ కాన్సెప్ట్ తో పాటు క్రైమ్ సెటప్ ను అలాగే రామ్ రెండు పాత్రలను, ఆ పాత్రల మధ్య ఎమోషన్ ను క్లారిటీగా బాగా ఎలివేట్ చేశారు. ఇక రామ్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా చక్కగా కుదిరాయి. అలాగే పోలీస్ గా కనిపించిన నివేదా పేతురాజ్ ను కూడా బాగా చూపించారు.

శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :