రెజీనా ప్రధాన పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్!

Published on Jul 16, 2021 7:48 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లు సైతం ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఈ మేరకు రెజీనా ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ కార్యాలయం లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఆహా వీడియో మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదిత సతీష్ లు కీలకం కానున్నారు. ఈ వెబ్ సిరీస్ కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :