
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా దశరథ్‌కి మంచి పేరుంది. తాజాగా ఆయన విభిన్న సినిమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్‌తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే! ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఫిల్మ్‌నగర్‌లోని ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌లో నిర్వహించి సినిమాను లాంచ్ చేశారు.
‘సూర్య vs సూర్య’ వంటి విభిన్న కథాంశంతో రూపొందిన సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 2 గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ రెజీనా ఖరారయ్యారు. మంచు మనోజ్‌తో రెజీనా జతకట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ముఖ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకి కథ,దర్శకత్వం : దశరధ్ , స్క్రీన్ ప్లే : కిశోర్ గోపు, రచన : గోపి మోహన్, కెమేరా : మల్హర్ భట్ జోషి, సంగీతం : కె. వేదా.

