రెజీనాతో రవితేజ లిప్ లాక్..?

రెజీనాతో రవితేజ లిప్ లాక్..?

Published on Aug 13, 2014 3:31 PM IST

Regina-Ravi-Teja
మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ రెజినా కాసాండ్రాల క్యూట్ లిప్ లాక్ ‘చంపేసిందే.. చంపేసిందే…’ పాటకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుందా..? ‘పవర్’ ఆడియో రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. తమన్ సంగీతం అందించిన ‘పవర్’ ఆడియో ఇటివలే విడుదలైంది. సాంగ్ ప్రోమోస్ కూడా విడుదల చేశారు. ఆడియోలో సూపర్ హిట్ అయిన మెలోడీ సాంగ్ ‘చంపేసిందే.. చంపేసిందే…’ విజువల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. పెట్టి పెట్టనట్టు, అంటి ముట్టనట్టు రేజీనా పెట్టిన లిప్ లాక్ హాట్ టాపిక్ అయింది. సినిమాలో ఫుల్ లిప్ లాక్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రవితేజ ఇప్పటివరకు లిప్ లాక్ సీన్లలో నటించలేదు. రేజీనా ‘రా రా కృష్ణయ్య’ సినిమాలో హాట్ లిప్ లాక్ సన్నివేశంలో నటించిన అనుభవం ఉంది.

‘పవర్’ సినిమాలో హన్సిక మెయిన్ హీరోయిన్ గా నటించింది. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాకు నిర్మాత.

తాజా వార్తలు