‘ఎవరు’ కోసం రెజీనా రెచ్చిపోతుంది !

‘ఎవరు’ కోసం రెజీనా రెచ్చిపోతుంది !

Published on Jul 19, 2019 6:46 PM IST

ఈ మధ్య కాలం వచ్చిన హీరోయిన్లలో టాలెంటెడ్ హీరోయిన్ అని క్యారెక్టర్ కోసం ఎటువంటి కసరత్తులైన చేస్తోందని ఇలా రెజీనాకి మంచి పేరే వచ్చింది. కానీ ఏం లాభం సరైన హాట్ లేకపోవడంతో.. క్రేజీ హీరోయిన్ గా మారలేకపోతుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. దాంతో అమ్మడికి ఛాన్స్ లు తగ్గాయి. ప్రస్తుతం రెజీనా తెలుగులో చేస్తోన్న ఒకే ఒక్క సినిమా `ఎవ‌రు’.

అయితే రెజీనా ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ పరంగా ఎలాంటి హద్దులు లేకుండా రెచ్చిపోయి మరి నటిస్తోందట. ముఖ్యంగా రెజీనా క్యారెక్టర్ సినిమాలో బాగా బోల్డ్ గా ఉంటుందని.. అలాగే కాస్త వైవిధ్యంగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ‘ఎవరు’ సినిమా రెజీనా కెరీర్ కి బాగా ప్లస్ కానుందని చిత్రబృందం కూడా చెబుతుంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెజీనా కూడా బాగానే హైలెట్ అయింది.

కాగా వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా రూపొందుతోన్న ఈ థ్రిల్ల‌ర్ మూవీలో యంగ్ హీరో న‌వీన్ చంద్ర ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు