అందాల నటి రెజినా కొంతకాలంగా తెలుగులో భిన్నమైన సినిమాలే చేస్తోంది. ‘ అ !, సెవెన్, ఎవరు’ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఈ సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి పేరే దక్కింది. అందుకే ఇకపై కూడా అలాంటి చిత్రాలే చేయనుంది ఆమె. తమిళ దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్షన్లో ఒక కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో రెజినా ఒక కీ రోల్ చేయనుంది.
ఇంతకీ అమె పాత్ర ఏమిటని అనుకుంటున్నారా.. ఆస్ట్రాలజర్. ఇందులో మనుషుల భవిష్యత్ చెప్పే ప్రత్యేకమైన వ్యక్తిగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర మీద, సినిమా మీద రెజినా చాలా నమ్మకంగా ఉంది. జనవరి రెండో వారం నుండి చెన్నైలో ఈ సినిమా షూట్ మొదలుకానుంది. ఇందులో మరొక నటి అక్షర గౌడ కూడా ఒక కీ రోల్ చేయనుంది.
