“మహా సముద్రం” కి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్!

“మహా సముద్రం” కి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Aug 27, 2021 12:18 PM IST


ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి ఎన్నో చిత్రాలు రిలీజ్ కి వస్తున్నాయి మరియు రిలీజ్ కి రెడీ అవ్వనున్న చిత్రాలు డేట్ లు కూడా వచ్చేస్తున్నాయి. అలా ఇప్పుడు మరో అవైటెడ్ చిత్రం కూడా అందులో చేరింది. అదే హీరో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ లు కలిసి నటిస్తున్న చిత్రం “మహా సముద్రం”. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 14న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేసారు. మరి ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ మరియు అదితి రావు హైదరిలు హీరోయిన్స్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు