వివిఆర్ విడుదల తేదీ ఖరారు !

వివిఆర్ విడుదల తేదీ ఖరారు !

Published on Dec 16, 2018 3:25 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణను జరుపుకుంటుంది. డిసెంబర్ 26తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న భారీ స్థాయిలో విడుదలకానుంది. బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందని సమాచారం.

అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. ఈచిత్రంలోని రెండవ సాంగ్ ‘తస్సాదియ్యా’ రేపు సాయంత్రం 4గంటలకు విడుదలకానుంది.

ఇక ఇటీవల ‘ధృవ , రంగస్థలం’ చిత్రాలతో వరుస బ్లాక్ బ్లాస్టర్ విజయాలను అందుకొన్న రామ్ చరణ్ మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను సాదిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు