రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుమంత్ ‘ఇదం జగత్’ !

Published on Dec 21, 2018 5:05 pm IST

సీనియర్ హీరో సుమంత్ ఇటీవల ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా మంచి టాక్ ను తెచ్చుకొని పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకువచ్చింది. ఇక ఈ చిత్రం ఇంకా థియేటర్లలో వుండగానే సుమంత్ నటించిన మరో చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఇదం జగత్’. ఈ చిత్రంలో సుమంత్ సరసన అంజు కురియన్ కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 28న విడుదలకానుంది.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈచిత్రాన్నిజొన్నలగడ్డ పద్మావతీ, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతో కూడా సుమంత్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :