విడుదల కి సిద్ధమైన కంగనా రనౌత్ “తలైవీ”

Published on Aug 23, 2021 6:02 pm IST

ప్రముఖ నటి, రాజకీయ రంగం లో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి జయ లలిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవీ. ఆరు సార్లు ముఖ్యమంత్రి గా పని చేసిన జయ లలిత తన జీవితం లో జరిగిన పలు కీలక సంఘటన ల ఆధారం గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ ను పోషించడం జరుగుతుంది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీను ప్రకటించడం జరిగింది. సెప్టెంబరు 10 వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, హిందీ మరియు తెలుగు బాషల్లో కూడా విడుదల కానుంది. విష్ణు వర్ధన్ ఇందురి, శైలేష్ ఆర్. సింగ్, బృంద ప్రసాద్ లు విబ్రి మోషన్ పిక్చర్స్ మరియు కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ పతకాల పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో అరవింద్ స్వామి, భాగ్య శ్రీ, శమ్నా కశీం,రాజ్ అర్జున్, సముద్ర ఖని, ప్రియమణి, నాజర్, భరత్ రెడ్డి, అశుతోష్ రాణా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, మరియు వీడియో లు ఇప్పటి కే సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

సంబంధిత సమాచారం :