షాహిద్ కపూర్ “జెర్సీ” విడుదల కి డేట్ ఫిక్స్!

Published on Sep 26, 2021 6:17 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో నాని హీరోగా నటించారు. ఈ చిత్రం లో నాని పాత్ర లో బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తున్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేది పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో మృణల్ ఠాకూర్, పంకజ్ కపూర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, సూర్య దేవర నాగ వంశీ, దిల్ రాజు, అమన్ గిల్ లు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ మరియు సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సచేత్ పరంపర ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :