వర్మ – రాజశేఖర్ ల ‘పట్ట పగలు’ రిలీజ్ డేట్

Patapagalu

హర్రర్ సినిమాలు తీయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు చేసిన రాజశేఖర్ కాంబినేషన్ లో రానున్న హర్రర్ సినిమా ‘పట్ట పగలు’. ముందుగా ఈ సినిమాని జూన్ 6న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా ‘పట్ట పగలు’ సినిమాని ఆగష్టు 12 న రిలీజ్ చేయనున్నట్లు వర్మ తెలియజేశారు.

దీనికి కారణం సడన్ గా రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ సినిమాని రిలీజ్ చేయాలనుకోవడమే. ఐస్ క్రీమ్ సినిమా జూలై 11న విడుదలకు సిద్దమవుతోంది. ఇది రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత వర్మ ‘పట్ట పగలు’ సినిమాని రిలీజ్ చేయనున్నాడు.

‘పట్ట పగలు’ సినిమాలో రాజశేఖర్ తండ్రి పాత్రలో కనిపించనుండగా స్వాతి దీక్షిత్ రాజశేఖర్ కుమార్తెగా కనిపించనుంది. బాక్స్ ఆఫీసు వద్ద ఈ మూవీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని రాజశేఖర్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Exit mobile version