విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న నారా రోహిత్ సినిమా !

నారా రోహిత్ ప్రస్తుతం ‘ఆటగాళ్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఈ చిత్రంలో నారా రోహిత్ కు ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నాడు. పరుచూరి మురళీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను జూలై 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రోహిత్ కు జోడీగా బెంగాలీ మోడల్ దర్శన బానిక్ నటిస్తోంది. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version