మైసూరులో ‘మనం’ జ్ఞాపకాలు – నాగార్జున

మైసూరులో ‘మనం’ జ్ఞాపకాలు – నాగార్జున

Published on Mar 10, 2015 12:06 PM IST

nagarjuna
అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమా షూటింగ్ కొన్ని రోజులు మైసూరులో జరిగింది. నాగార్జున, శ్రియలపై 2013, డిసెంబర్లో అక్కడ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు తెరకెక్కించారు. తాజాగా కింగ్ నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ మైసూరులో జరుగుతుంది. ఓసారి నాగార్జున అలా ‘మనం’ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’. అక్కినేని కుటుంబానికి, తెలుగు సినీ అభిమానులకు ‘మనం’ ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. క్లాసికాల్ హిట్ గా నిలిచింది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. యాంకర్ అనసూయ, హంసా నందిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రామ్ మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు