హిట్టు లేకున్నా పారితోషికం మాత్రం పేచేసిందట !

Rakul Preet Singh

ఇటీవల తెలుగులో ఆఫర్లు లేక కోలీవుడ్ కు వెళ్లి అక్కడ బిజీ అయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కార్తీ నటించిన ఖాకి చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాదించడంతో ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ను పెంచేసింది ఈ హీరోయిన్. ఈసినిమా తరువాత ప్రస్తుతం సూర్య సరసన యెన్ జి కె అలాగే శివ కార్తికేయన్ తో ఓ సినిమాలో నటిస్తుంది రకుల్. అయితే ఇటీవల కార్తి తో దేవ్ అనే సినిమాలో నటించింది. ఈసినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా తన పారితోషికం తగ్గించుకోపోగా ఈ కొంచెం పెంచేసిందట. దేవ్ వరకు కోటి రూపాయల పారితోషికం తీసుకున్న రకుల్ ఇటీవల తెలుగులో నాగార్జున కు జోడిగా మన్మథుడు 2 అనే చిత్రానికి సైన్ చేసింది. ఈ చిత్రానికి గాను కోటి 50లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సోషల్ మీడియా లో వార్తలు వెలుబడుతున్నాయి. మరి ఈ సినిమా తరువాత రకుల్ మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.

ఇక సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే లేడీ సూపర్ స్టార్ నయన తార. ప్రస్తుతం 7 సినిమాలతో బిజీగా వున్నా నయన్ ఒక్కో సినిమాకి 3నుండి 4కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందట.

Exit mobile version