అకీరా పవన్ వద్ద ఉండటంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ !

అకీరా పవన్ వద్ద ఉండటంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ !

Published on Jun 23, 2018 2:17 PM IST

renu desai

తన కుమారుడు అకీరా నందన్ ను పవన్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అతని తల్లి, పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తాజాగా అకీరా నందన్ పవన్ వద్ద ఉండటంపై కూడ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటే ఆయన కుమారుడు అకీరా నందన కూడ పలు చోట్ల కనిపించాడు.

దీంతో అభిమానులు కొంతమంది అకీరా నందన్ హైదరాబాద్ షిఫ్ట్ అయి పవన్ వద్దనే ఉంటున్నాడని అనుకున్నారు. ఈ విషయం రేణు దేశాయ్ వరకు వెళ్లడంతో ఆమె క్లారిటీ ఇస్తూ స్కూలుకు కొన్ని రోజులు సెలవులు ఉండటంతో అకీరా తన తండ్రి పవన్ వద్దకు వెళ్లాడని, అంతేగాని హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు