తెలుగులో సినిమా చేయబోతున్న రేణు దేశాయ్ !
Published on Aug 10, 2018 4:00 pm IST

రేణు దేశాయ్ ఇటీవలే తనకు కాబోయే భర్తతో నిశ్చితార్ధం జరుపుకొని తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే రేణు దేశాయ్ ఈ మధ్య త్వరలోనే నేరుగా ఓ తెలుగు సినిమాని రూపొందించబోతున్నానని తెలిపారు.

కాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల ఆధారంగా ఓ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. త్వరలోనే ఆమె ఒక గ్రామానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు వాళ్లతో గడిపి రైతుల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నే సమస్యలను అర్థం చేసుకోనున్నారట. ఇక ఈ చిత్రాన్ని స్వయంగా రేణు దేశాయ్ నే నిర్మించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక గతంలో రేణుకు ఓ మరాఠీ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన అనుభవం ఉంది.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook