పవన్ యాంటీ ఫ్యాన్ పై నిప్పులు చెరిగిన రేణు

పవన్ యాంటీ ఫ్యాన్ పై నిప్పులు చెరిగిన రేణు

Published on Feb 3, 2015 8:13 AM IST

renu_desai

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల చిన్నారి ఆద్య ఇటీవలే తన స్కూల్ కల్చరల్ ఈవెంట్ లో కార్యక్రమం ఇచ్చిన విషయం మేము ముందుగానే తెలిపాం. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కాస్త డొంక తిరుగుడుగా తెలిపిన రేణు ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది.

“నా చిన్నారి కూతురు స్కూలులో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూతురు ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. అదొక ఎమోషనల్ మూమెంట్. ఈ భావన తల్లిగా నా కంటే తండ్రికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్పలేనిది” అంటూ తొలుత రేణు దేశాయ్ ట్వీట్ చేసింది. అయితే దీన్ని సరిగ్గా అర్ధంచేసుకుని పవన్ యాంటీ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ మంచి తండ్రికాదని స్టేట్మెంట్ ఇచ్చి పాదేసాడు.

అతని ట్వీట్ కి రేణు స్పందిస్తూ “ముందు నువ్వు వెళ్ళి ఇంగ్లిష్ నేర్చుకో, నేను చెప్పిన ట్వీట్ లో పవన్ హాజరయ్యినట్టే ఉంది” అని రిప్లై ఇచ్చింది. దీనితో ఉన్నట్టుంది వాతావరణం గందరగోలంగా మారింది. చివరికి గొడవ సర్దుమనగడంతో కధ ప్రశాంతంగా ముగిసింది.

తాజా వార్తలు