పవన్ కళ్యాణ్ మాజీ సతీమణికి నిశ్చితార్ధం జరిగింది !

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణికి నిశ్చితార్ధం జరిగింది !

Published on Jun 24, 2018 5:21 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకుని ఉన్న ఫొటోతో పాటుగా ‘నీలో నా ప్రేమ దొరికింది, నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అని ఆ వ్యక్తి గురించి స్వయంగా రేణుదేశాయ్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్, తనకు ఆ వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిందని వెల్లడించింది. అయితే ఆమెకు కాబోయే వరుడు గురించి ఏ వివరాలు వెల్లడించలేదు.

అయితే ఆమె గతంలో తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు నుండి ఆమె తీవ్రమైన వ్యతిరేకతను ఎదురుకుంది. సోషల్‌మీడియాలో ఆమెను విమర్శిస్తూ వారు తమ నిరసనను తెలిపారు. ఇప్పుడు ఆమె నిజంగానే మరో వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు