రేణు దేశాయ్ సంతోషానికి కారణం అదేనా ?

Published on Jul 19, 2018 3:30 pm IST


పవన్ కళ్యాణ్ నుండి విడిపోయాక చాలా సంవత్సరాలు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటూ వచ్చిన రేణు దేశాయ్ ఈ మధ్యే తన కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆమెను వ్యతిరేకించే వారే ఎక్కువగా తయారయ్యారు. దీంతో విసిగిపోయిన రేణు దేశాయ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణే విడాకులు ఇవ్వాలని కోరారని చెప్పుకొచ్చారు. వెంటనే పవన్ అభిమానుల్లో కొందరు రేణు దేశాయ్ ను సోషల్ మీడియాలో మళ్ళీ విమర్శించగా ఆమె అప్పుడే స్పందిస్తూ…‘ 2012 మార్చి 13వ తేదీన బేబీ పోలినా పుట్టింది. ఆ తర్వాత మూడు రోజులకు 2012 మార్చి 16న తనకు పవన్ విడాకులు ఇచ్చారు. అంటే 2011 జులైలోనే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా గర్భందాల్చింది.’ అని డివోస్ లో తన తప్పేం లేదని రేణు దేశాయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాగా, ఆమె ఇప్పుడు తన కోసం తాను బతుకుతున్నారు. నిజంగానే గతంలో కంటే రేణు దేశాయ్ చాలా స్వేఛ్చగా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. పవన్ తో పదిసంవత్సరాలు పైగానే కలిసి ఉన్న ఆమె ఎప్పుడూ ఇలా మీడియా ముందుకు వచ్చి ఇంత స్వేఛ్చగా మాట్లాడలేదు. తాజాగా ఆమె తన కుమార్తె అధ్య, కుమారుడు అకిరాతో దిగిన ఫోటోను కూడా షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆమె ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఆమె పై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకపోవడమేనట. ఆమె ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :